నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.


టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ వాళ్ళ ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. రాధాకృష్ణ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ' బాహుబలి ' స్టార్ నటించబోతున్నట్లు మనందరికీ తెలిసిందే. ' మహానటి ' చిత్రబృందం ఈ వార్తను లాంగ్ బ్యాక్ ప్రకటించింది.

ప్రభాస్ తో సినిమా రూపొందించబోతున్నానని, అది రీమేక్ గానీ, బయోపిక్ గానీ కాదని నాగ్ అశ్విన్ చెప్పాడు. అది ఒరిజినల్ స్క్రిప్టు కాబట్టి ప్రభాస్ ను పూర్తిగా కొత్త యాంగిల్ లో చూపించనున్నారు. రిపోర్టుల ప్రకారం సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందనున్నట్టు, భారీ బడ్జెట్ లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సెల్యులాయిడ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇతర భాషల్లో విడుదల కానుంది.

షెడ్యూల్ ప్రకారం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ 2020 ముగింపు దిశగా కిక్ స్టార్ట్ చేయాలని, 2021 చివరి నాటికి విడుదల చేస్తామని తెలిపారు. కానీ, ఇప్పుడు లాక్ డౌన్ వల్ల, స్థిర షెడ్యూలులో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు.నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందనుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం హీరోయిన్ ను ఫైనలైజ్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అలియా భట్ రొమాన్స్ చేసే అవకాశం ఉందని తెలిసింది.

ఇంతకుముందు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ ల పేర్లు కూడా ఈ చిత్రం కోసం పరిశీలనలోకి  వచ్చాయి. అలియా భట్ కూడా టాలీవుడ్ లో మరిన్ని సినిమాలలో నటించే ఆకాశం ఉంది. తమ సినిమాల కోసం అలియా భట్ ను తీసుకోవటానికి తమ ఆసక్తిని చూపిస్తున్నారు టాలీవుడ్ చిత్ర నిర్మాతలు. ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు మరి ప్రభాస్ సరసన స్క్రీన్ స్పేస్ ను ఎవరు షేర్ చేసుకోబోతున్నారో వేచి చూద్దాం.

0/Post a Comment/Comments

Previous Post Next Post