Huawei Enjoy Z 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ధర మరియు ఫీచర్లను తెలుసుకోండి


Huawei Enjoy Z 5G చైనా మార్కెట్లో లాంచ్ అయింది. Huawei బ్రాండ్ కు చెందిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లోని కీలక ఫీచర్ 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో వస్తోన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఇది వాటర్ డ్రాప్ స్టైల్ నోచ్ మరియు రియర్ మౌంటెడ్ వేలిముద్ర సెన్సార్ తో వస్తుంది.  ఇది ఐతకార్ మాడ్యూల్ లో ఉంది. Huawei ఎంజాయ్ జడ్ 5g మిడ్ నైట్ బ్లాక్, స్కై బ్లూ అండ్ పింక్ కలర్ లో లాంచ్ అయింది. నానో మెమరీ కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం ఉంది.

Huawei Enjoy Z 5G ధర

Huawei Enjoy Z 5g ధర చైనాలో CNY 1,699 (సుమారు రూ. 18,900) నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియెంటులు. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను CNY 1,899 (సుమారు రూ. 20,200), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంటులు CNY 2,199 (సుమారు రూ. 23,400) వద్ద విక్రయిస్తారు. మిడ్ నైట్ బ్లాక్, స్కై బ్లూ, పింక్ కలర్స్ లో దీన్ని అందుబాటులో తయారుచేస్తారు.

Huawei Enjoy Z 5G ఇండియాకు సంబంధించి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు.

Huawei Enjoy Z 5G ఫీచర్లు 

Huawei Enjoy Z 5Gలో హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంది. Android 10  EMUI 10.1 ఆధారంగా నడుస్తుంది. ఇందులో 6.57 అంగుళాల ఫుల్-హెచ్ డీ + (1080x2400 పిక్సల్స్) ఎల్ సీడీ డిస్ ప్లే ఉంది. ఇది 405 పీపీఎం పిక్సెల్స్ డెన్సిటీ, 20:9 కారక నిష్పత్తితో  ఉంది. ఈ ఫోన్ లో 8 జిబి ర్యామ్, 128 జీబి వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. నానో మెమరీ కార్డును తో 256 జీబీ వరకు స్టోరేజ్ ని పెంచుకోవచ్చు. మీడియా టెక్ డిమెంసిటి 800 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రాన్ అవుతుంది.

Huawei Enjoy Z 5G మూడు రేర్ కెమెరాలతో వస్తోన్న స్మార్ట్ ఫోన్. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్/1.8 aperture తో. ఇందులో అల్ట్రా వైడ్ కెమెరా 8 మెగాపిక్సల్, ఒక మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సల్. ఫ్రంట్ ప్యానల్ లో వాటర్ డ్రాప్ నోచ్ లో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 4,000 mah. 22.5 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టువిటీ ఫీచర్లలో వై-ఫై 802.11 ఏసీ, 5G, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్ కొలుతలు  160x 75.32 x 8.35 mm మరియు బరువు 182 గ్రాములు.

0/Post a Comment/Comments

Previous Post Next Post