ఆరు నిమిషాల యాక్షన్ సీన్ కోసం రూ. 6 కోట్ల?


అల వైకుంఠపురం సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ మధ్యనే 'పుష్ప' సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడవ చిత్రం. మొదటి చిత్రం ఆర్య అల్లు అర్జున్ కి రెండవ సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయింది . రెండవ సారి ఆర్య 2 చిత్రానికి వీరిద్దరూ కలిసి పనిచేసారు. ఆ సినిమాకి ఊహించని ఫలితం వచ్చినా క్లాసిక్ గా నిలిచింది.

ఇక అసలు విషయానికి వస్తే పుష్ప చిత్రలోని  ఒక భారీ యాక్షన్ సీన్ కోసం భారీగా ఖర్చుచేస్తున్నారట చిత్ర నిర్మాతలు. అల్లు అర్జున్, విజయ్ సేతుపతిల మధ్య ఉండే ఆరు నిమిషాల యాక్షన్ సీన్ కోసం దాపు రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నారట. మొదట ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో చిత్రీకరించాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించున్నారు. ఇండియా లోని బెస్ట్ టెక్నిషియన్స్ ని ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైర్ చేసుకున్నారని సమాచారం. చూడాలి మరి ఈ యాక్షన్ సీక్వెన్స్ ఎలా వుందబోతుందో .

తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతోన ఈ చిత్ర షూటింగ్ లక్డావన్ కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post