పవన్ కళ్యాణ్ సరసన అనుష్క!


రెండేళ్ల రాజకీయ విరామం తరువాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.  శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బాలీవుడ్ మూవీ 'పింక్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్'. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినీమాకి బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా గా రూపొందుతోంది.

 శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌లో వవన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి సెన్సేషనల్ హిట్ మూవీ తీసిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పండగల సాయన్న అనే గజదొంగ పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.కమర్షియల్ హంగుల విషయంలో పవన్ కళ్యాణ్‌ కు వున్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని క్రిష్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈ సినిమాలో రాజ కుటుంబానికి చెందిన మహిళ పాత్ర కోసం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు బాలీవుడ్ వర్గాలు ఖరారు చేశాయి.

ఇదిలా ఉంటే, ఇప్పుడు అనుష్కను పవన్ సరసన నటించే హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. క్రిష్ ఇప్పటికే ఆమెను సంప్రదించి స్క్రిప్ట్ ని వీడియో కాల్ ద్వారా వినిపించారని.. అనుష్కకు స్క్రిప్ట్ నచ్చటంతో ఈ పాత్ర చేయటం కోసం ఓకే చెప్పారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని అంటున్నారు. అనుష్కకు ఇలాంటి పీరియాడిక్ సినిమాలలో నటించడం కొత్తేమీకాదు. అనుష్క ‘సైరా’, ‘బాహుబలి’,  ‘రుద్రమదేవి’ వంటి సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. కాబట్టి,  అనుష్క అయితే పవన్ సినిమాలో పాత్రకు న్యాయం చేస్తారని ఫిక్స్ అయ్యారట క్రిష్. అనుష్క అంగీకరించడంతో ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నారని టాక్.

0/Post a Comment/Comments

Previous Post Next Post