'అవతార్ 2' రిలీజ్ పై కరోనా ఎఫెక్ట్ ?


హాలీవుడ్ అగ్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రం అవతార్ కి వరుసగా సీక్వెల్స్ రానున్న విషయం తెలిసిందే. చిత్రీ కరణ దశలో ఉన్న మొదటి సీక్వెల్ ' అవతార్ 2 ' చిత్రీ కరణ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ' అవతార్ 2 ' విడుదలపై స్పష్టత ఇచ్చేందుకు దర్శకుడు జేమ్స్ కామెరూన్ ముందుకువచ్చారు. ఏదిఏమైనా అనుకున్న సమయానికే ' అవతార్ 2 ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని తెలిపారు.

''లాక్ డౌన్  కంటే ముందు గానే మేము ఈ సినిమా షూటింగ్ ను న్యూజిలాండ్ లో చేయటానికి సిద్ధమయ్యాం. కానీ కరోనాతో ఆలస్యమైంది. అయితే తిరిగి త్వరలోనే అక్కడ షూటింగ్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ అక్కడ పరిస్థితులు కొంచం భిన్నంగా ఉన్నాయి.  ప్రస్తుతం పూర్తిగా ఈ వైరస్ ని నిర్మూలించటమనేది సాధ్యమయ్యే పనికాదు. కానీ వైరస్ ను నియంత్రించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పది పనులు ఆలస్యమైనా, మరికొన్ని అంశాలలో ఈ సమయం మంచి అవకాశంగా ఉపయోగపడింది. ఇప్పుడున్న డిజిటల్ యుగం అందరికి చాలా ఉపయోగపడుతోంది. దాని వల్లే కొన్నిపనులను ఇంటి దగ్గర నుంచే పూర్తీ చేసాం. ఎట్టి ' అవతార్ 2' సినిమాను డిశంబర్ 17, 2021 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం.'' అని కామెరూన్ అన్నారు.

ప్రస్తుతం 'అవతార్ 2' 'అవతార్ 3'నిర్మాణ దశలో ఉన్నాయి. 'అవతార్ 2' డిశంబర్ 17, 2021 న మరియు 'అవతార్ 3' డిశంబర్ 22, 2023 న రానున్నాయి. ఇవి విజయవంతం ఐతే 'అవతార్ 4,5' సినిమాలను కూడా పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఒక బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఈ సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి.  సామ్ వర్డింగ్టన్ , జోయ్ సల్దానా, కేట్ విన్స్ లెట్, రిబ్స్,జోయల్ డేవిడ్ మూర్తీ,దిలీప్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post