అనుమతులు ఇస్తేనే అక్టోబర్ లో విడుదల!


బాహుబాలి సినిమా తరువాత దేశమంతా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా కెజిఎఫ్ చాప్తర్-1. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి 'కెజిఎఫ్ చాఫ్టర్-2' అనే టైటిల్ తో సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా పలు చిత్రాల షూటింగ్లు నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా సినిమాల విడుదల తేదీలలో మార్పులు జరగబోతున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా... మొదట్లో అక్టోబర్ నెలలో 'కెజిఎఫ్ చాఫ్టర్-2' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటనిచ్చింది. అయితే ప్రస్తుతానికి 'కెజిఎఫ్ చాఫ్టర్-2' చిత్రం షూటింగ్ కూడా నిలిచిపోవటంతో.. విడుదల తేదీలలో కూడా మార్పులు ఉండవచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కెజిఎఫ్ చాఫ్టర్-2'సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత  గౌడ్ స్పందించారు. జులై నెలలో షూటింగ్లకు అనుమతి ఇస్తే ముందుగా ప్రకటించినట్లు అక్టోబర్ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. అంతేకాకుండా సినిమాలోని రెండు ఫైట్లు మినహా చాలా వరకు షూటింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు.

                                 డిజిటల్ రైట్స్ రికార్డ్ 

అమెజాన్ ప్రయిమ్ లో కెజిఎఫ్ సినిమా ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో 'కెజిఎఫ్ చాఫ్టర్-2' సినిమాని ఏకంగా 55 కోట్లకు కొనుగోలు చేసిందట అమెజాన్ ప్రయిమ్. కన్నడతో పాటు హిందీ,మళయాళం,తమిళం,తెలుగు భాషలలో కలిపి ఇంట పెద్ద మొత్తం పెట్టినట్టు తెలుస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post