ఓ రూమర్‌తో ఈ భామ‌ ఫేట్ మారుతోందిగా..


హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కి వెళ్లే ఆస్కారం ఉన్న ఈ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత హరీష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో తన సినిమా పనులతో బిజీ అయిపోయాడు హరీష్. ఇక పవన్ కళ్యాణ్ సరసన మలయాళీ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

బాలనటిగా మలయాళ చిత్రపరిశ్రమకి పరిచయమైన మానస రాధాకృష్ణన్ ఆ తర్వాత ఓ పది సినిమాల వరకూ అక్కడ హీరోయిన్‌గా చేసింది. ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి. అయితే దర్శకుడు హరీష్ శంకర్ఇ దంతా కేవలం పుకారు మాత్రమేనని  స్పష్టం చేశాడు. ఇంతలోపే అసలు ఈ మానస రాధాకృష్ణను ఎవరు అంటూ పవన్ అభిమానులు ఆమె కోసం గురించి గూగుల్‌‌లో వెతకటం తో పాటు ఇటు ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాతలు, దర్శకులు కూడా ఆమె నటించిన సినిమాల వివరాలను తెలుసుకున్నారు.

అంతేకాదు యువ కథానాయకులకు జోడీగా ఈ భామ అయితే బాగుంటదని వారు నిర్మించే సినిమాల్లో హీరోయిన్‌గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. అందులో భాగంగా మానస రాధాకృష్ణను సంప్రదించడం లాంటీవి కూడా జరుగుతున్నాయని టాక్. ఇలా ఈమెను వెతుక్కుంటూ వరుస అవకాశాలు వెళుతున్నాయని అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ రూమర్ ఈమెకు అవకాశాలను తెచ్చిపెడుతోంది అన్నమాట. ఈ భామ ఏ యువ కథానాయకుడి సరసన మెరవనుందో వీచి
చూడాలి మరి.

0/Post a Comment/Comments

Previous Post Next Post