యంగ్ లుక్‌లో, తొలిసారి షర్ట్ లేకుండా కనిపించిన మహేశ్ బాబు


కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు లేక అందరూ తమ ఇళ్లల్లో కుటుంబాలతో కాలం గడుపుతున్నారు. ఇళ్లల్లో ఖాళీగా ఉండలేక కొంతమంది ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టారు. మరికొందరు వంటలు చేయటం, ఇల్లు శుభ్రం చేయడాలు వంటి పనులు చేస్తున్నారు. లాక్ డౌన్ మొదలవ్వకముందు వరకు షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉన్నవారికి అనుకోని విధంగా ఖాళీ సమయం దొరికింది. దీంతో ఈ సమయం కుటుంబాలతో ఎక్కువ గడిపేందుకు ఉపయోగపడుతోంది.

తాజాగా మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ మహేశ్‌, కుమారుడు గౌతమ్, కూతురు సితారలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలో మహేశ్ బాబు చాలా కూల్‌గా యంగ్‌ లుక్‌లో కనబడుతున్నాడు. రంగు కళ్లజోడు పెట్టుకుని కొడుకుకి అన్నలా మహేశ్ ఇచ్చిన స్టిల్‌కి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. లాక్‌డౌన్‌తో మహేశ్ మరింత యంగ్‌గా మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు.


మహేష్ బాబు సినిమాల్లో ఎంత ఇరగదీస్తాడో కొన్ని విషయాల్లో అంత రిజర్వుడుగా ఉంటారు. ముఖ్యంగా బాడీని చూపించడానికి అసలు ఇష్టపడడు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో షర్ట్ లేకుండా కనిపించడు. కావాలంటే టీషర్టుపై చొక్కా వేసుకుని కూడా కనిపిస్తాడు.  కథ ప్రకారం కండలు చూపించాల్సి  వస్తుందని కొన్ని సినిమాలు కూడా వదులుకున్నాడు. ఇంత సిగ్గేంటి బాబూ అని అభిమానులు విసుక్కున్నా ఇట్స్ మై లైఫ్ అనేస్తాడు.

అలాంటి మహేశ్ బాబు తొలిసారిగా చొక్కా లేకుండా కనిపించాడు. సినిమాల కోసం కాదులెండి, ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో.  కూతురు సితారతో కలిసి పూల్లో సందడి చేస్తున్న ఫొటోను భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులోనూ  ప్రిన్స్ పూర్తిగా కాకుండా ఛాదీ వరకు మాత్రమే నగ్నంగా కనిపిస్తున్నాడు. అభిమానులు దాన్ని వైరల్ చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post