'పుష్ప' సినిమాలో కొత్త విలన్


ఇటీవలే 'ఆల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ కొట్టిన అల్లుఅర్జున్ మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఏంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా 'పుష్ప'. అల్లుఅర్జున్ పుట్టినరోజున విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ ఇప్పటికీ వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమాలో అల్లుఅర్జున్ కోసం భారీ విలన్ క్యారెక్టర్ రెడీ చేశారట సుకుమార్. హీరోతో పోటాపోటీగా ఉండాలన్న ఆలోచనతో మొదట తమిళ స్టార్ విజయ్ సేతుపతిని ఈ క్యారెక్టర్ కోసం సెలక్ట్ చేశారట. కానీ అనుకోని కొన్ని కారణాలవల్ల విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం కొన్ని రోజులుగా బాబీ సింహా, అరవింద స్వామీ పరిశీలిస్తున్న సుకుమార్ ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.

బాబీ సింహాను సంప్రదించిన సుకుమార్ 'పుష్ప' లోని విలన్ పాత్ర గురించి చెప్పారట. ఆ పాత్ర నచ్చటంతో బాబీ సింహా డేట్స్ కూడా ఇచ్చేశారనేది కొత్త అప్ డేట్. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఆయన 'పుష్ప' షూటింగ్లో ఉంటారని తెలుస్తోంది. అల్లు అర్జున్ పూర్తి మాస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. లారీ డ్రైవర్ గా అల్లుఅర్జున్ అదరగొట్టనున్నారు. మాస్ ప్రేక్షకుల కోసం అదిరిపోయే సన్నివేశాలు ఉంటాయని టాక్. రష్మిక మందన్న ఇప్పటి వరకు కనిపించని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం.

0/Post a Comment/Comments

Previous Post Next Post