రాజమౌళి నిర్ణయం కోసం వేచి చూస్తున్న టాప్ హీరోస్!


దర్శక ధీరుడు రాజమౌళి దర్వకత్వంలో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న  భారీ పాన్ ఇండియా మూవీ RRR. వాస్తవానికి మొదట ఈ చిత్రాన్ని జూలై 31 2020న విడుదల చేయాలని యూనిట్ భావించారు. అయితే, బెస్ట్  ఔట్‌పుట్ కోసం తమకు మరింత ఎక్కువ  సమయం పడుతుందని, అందువల్ల విడుదల తేదీని 2021 జనవరి 8కి మారుస్తాన్నామని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి ఖఛ్చితంగా  జనవరి 8న విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

అయితే, గత కొన్నిరోజులుగా కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితుల్లో సినిమాల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. సినిమాలకు సంబంధించి ఎలాంటి పనులు కూడా  జరగని పరిస్థితి. ఇప్పటికే పనులు   అన్నీ ఆగిపోయి 40 రోజులకు పైగా ఆయిపోయాయి. మరో 20 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే, రెండు నెలలు వృథాగా పోయాయి. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి RRR సినిమాను పూర్తిచేయడం కష్టమే అనే వాదన ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కచ్చితంగా RRR విడుదల తేదీని మారుస్తారని అంటున్నారు.

అయితే, సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలు అందరు RRR విడుదల తేదీ విషయంలో రాజమౌళి, డీవీవీ దానయ్య తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. RRR మేకర్స్ ప్రకటన కోసం చిరంజీవి, ప్రభాస్, నానితో పాటు ఇతర హీరోలు వేచి చూస్తున్నారట. ఎందుకంటే చిరంజీవి తన సినిమా ‘ఆచార్య’ను సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. అలాగే, ప్రభాస్ సైతం సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారట. ఒకవేళ RRR విడుదలను వాయిదా వేస్తే సంక్రాంతికి తమ తేదీలు ఖరారు చేసుకోవాలని చూస్తున్నారట.

0/Post a Comment/Comments

Previous Post Next Post