హానర్ 9X Pro కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది


స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు భారత్ లో తమ ఫోన్ లను విడుదల చేసి చాలా రోజులు అయింది. కరోనా కారణంగా బహిరంగ ఈవెంట్ల ద్వారా విడుదల చేయాల్సిన తమ స్మార్ట్ ఫోన్లను కంపెనీలు ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే హానర్ సంస్థ వారి కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ 9x ప్రో ను ప్లిప్కార్ట్ లో విడుదల చేయనుంది.

హానర్ సంస్థ మే 21 న స్పెషల్ ఎర్లీ యాక్సెస్ ద్వారా ఈ ఫోన్ యొక్క అమ్మకాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ కి ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి సారిగా భారత్ లో హువాయి యాప్ గ్యాలరీలో విడుదల అవుతున్న స్మార్ట్ ఫోన్ ఇది. అంటే గూగుల్ కి సంబంధించిన గూగుల్ ప్లేస్టోర్, ప్లేసర్వీసెస్ వంటివి ఇందులో ఉండవు. చైనాలో గత ఏడాది మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం పిభ్రవరిలో ఈ ఫోన్ ను విడుదల చేశారు. 7.nm కిరిన్ 810 ప్రాసెసర్ ఈ ఫోన్ లోని ప్రధాన హైలైట్. ఈ ఫోన్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా మరియు 4,00 యంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

హానర్ 9X ప్రో ధరల వివరాలు

హానర్ 9X ప్రో ను భారత్ లో ఒక వేరియంట్ లో మాత్రమే విడుదల చేశారు. 6GB ర్యామ్ + 256GB స్టోరేజ్ గ ఈ సింగిల్ వేరియంట్ ధర 17,999 రూపాయలుగా సంస్థ నిర్ణయించింది. పాంతం బ్లాక్ మరియు మిడ్ నైట్ బ్లాక్ కలర్ లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ నెల చివరిలో ప్లిప్కార్ట్ లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

హానర్ 9X ‘స్పెషల్ ఎర్లీ యాక్సెస్’ ఆఫర్లు

హానర్ 9Xప్రోను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం హానర్ సంస్థ మే 21 మధ్యాహ్నం 12:00 గంటల నుండి మే 22 మధ్యాహ్నం 12:00 గంటల వరకు 'స్పెషల్ ఎర్లీ యాక్సెస్ సేల్ ను ప్లిప్కార్ట్ లో నిర్వహించనుంది. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఈ సేల్ లో ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి లభిస్తుంది.  అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ను కూడా పొందవచ్చు. అంతే కాదు కొనుగోలు చేసిన తేదీ నుండి 7 రోజుల వరకు రిటర్న్ పాలసీ మరియు 3నెలల చెల్లుబాటు కలం వరకు ప్రమాదవశాత్తు నష్టంపై వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ యొక్క ప్రయోజనాలను కూడా వినియోగదారులు పొందుతారు.



హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

హానర్ 9X ప్రో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్ లో 6.-అంగుళాల మరియు 1080x 2340 పిక్సెల్స్ గల ఫుల్ HD + IPS డిస్ప్లే ఉంటుంది. మరియు 92 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియాతో ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ మరియు యాండ్రాయిడ్ 9పై EMUI 9.1 తో వస్తుంది. యాండ్రాయిడ్ 10కు అప్డేట్ అవుతుంది. 6GB ర్యామ్ + 256GB ఇంటెర్నెల్ స్టోరేజ్ తో వస్తుంది. మరియు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ లో కిరిన్ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుంది.

హానర్ 9X ప్రో కెమెరాల ఇషయానికి వస్తే వెనుక ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోనీ IMX582 ప్రయిమరీ సెన్సార్తో మరియు F/1.8 లెన్స్ తో 48 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. 120డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (FOV)తో మరియు F/2.అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. చివరిగా డెప్త్ సెన్సార్తో, F/2.4  లెన్స్ తో 2 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం F/2.2 లెన్స్ తో 16 మెగా పిక్సల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో డ్యూయల్ 4G, వై-ఫై 801.11AC,బ్లూటూత్ V 4.2,జిపిఎస్/ఎ జిపిఎస్, 3.5 MM హెడిఫోన్ జాక్, యు ఎస్ బి టైప్-సి మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంనాయి.

AppGallery 

ఇందులో మీరు ఎటువంటి గూగుల్ సేవలను పొందలేరు. అలాగే ఇందులో ప్లేస్టోర్కు బదులుగా AppGallery ప్రీలోడ్ చేయబడి ఉంటుంది. మీకు కావలసిన ఇతర యాప్లను ఇందులో పొందవచ్చు. AppGalleryలో జాతీయ యాప్స్ అయిన గ్రోఫర్,జొమాటో,ఫ్లిప్కార్ట్,పెటియం,మ్యాప్ మై ఇండియా,మరియు మై ఎయిర్టెల్ వంటి వాటివి పెద్ద సంఖ్యలో ఉన్నాయి.  క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్ డిజిలాకర్, కాంటాక్ట్-ట్రేసింగ్ యాప్ మరియు ఆరోగ్య సేతు వంటి ప్రభుత్వ యాప్లు కూడా ఇందులో ముందే ఇంస్టాల్ చేయబడి ఉన్నాయి. అయితే నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి యాప్లు మీరు ఇందులో డౌన్ లోడ్ చేసుకోలేరు.

గూగుల్ మొబైల్ సర్వీసెస్‌పై HMSను తీసుకురావడం మరియు అమెరికా కంపెనీలను హువాయితో వ్యాపారం చేయకుండా నిషేధించిన కారణంగా సంస్థ AppGallery ను విడుదల చేసింది. ఈ నిషేధం కొనసాగే వరకు మీరు HMS మరియు AppGallery తోనే కొనసాగించవలసి ఉంటుంది. అయినప్పటికీ గూగుల్ ప్లే సేవలకు యాక్సిస్ లేని మీకు ఇష్టమైన ఆండ్రాయిడ్ యాప్ లను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు APK ఫైల్‌లను సైడ్-లోడ్ చేయవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post