రాజమౌళి, మహేష్ బాబు మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ !


ఇటీవలే రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో  చేయనున్నట్లుగా కీలక ప్రకటన చేసారు. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాజెక్టుపై అందరిదృష్టి పడింది. ఈ సినిమాకి బడ్జెట్ ఎంత? ఏ జానర్‌లో ఉంటుంది? అనేదానిపై చర్చలు మొదలయ్యాయి.

రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ మూవీని భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని,ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని, పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వాలనే దిశగా ఆలోచిస్తున్నారట. తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పాలని భావిస్తున్నారట. ఇందుకోసమై తన తండ్రి పుట్టిన రోజైన మే 31వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసేలా ఈ అప్‌డేట్ ఉండనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అటు రాజమౌళి ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. యదార్ధ ఘటనలకు కొంత కల్పితాన్ని జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 8న RRR సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే మహేష్ సినిమాను సెట్స్ పైకి తేవాలని చూస్తున్నారట రాజమౌళి. మహేష్ బాబు కూడా ఈ లాక్‌డౌన్ పూర్తి కాగానే పరశురామ్ దర్శకత్వంలో సినిమాని మొదలు పెట్టనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post