రామ్ చరణ్, విజయ్ కోసం రంగంలోకి మహేష్ బాబు! స్కెచ్ రెడీ..


సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరూ హీరోలుగా నటించి మెప్పించటమే కాదు దానికి అనుబంధ రంగాలైన ప్రొడక్షన్, ధియేటర్స్ రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ బాబు సొంతంగా ప్రొడక్షన్ హౌసెస్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ బాబు రామ్ చరణ్‌ని హీరో నాటించనున్న సినిమాని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన స్కెచ్ రెడీ అయిందని తెలుస్తోంది.

ఫిలిం నగర్ టాక్ ప్రకారం RRR సినిమా పూర్తి కాగానే రాంచరణ్ ఈ సినిమా చేస్తారట. వంశీ పైడిపెల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి ఇదివరకే మహేష్ బాబు తో చెయ్యాలనుకున్న కధతోనే రామ్ చరణ్ తో చేయాలనుకుంటున్నారట. ఈ కథను మహేష్ బాబు కు చెప్పినపుడు ఈ కదా తనకు సూట్ కాదని రిజెక్ట్ చేశారట. ఈ కథ రామ్ చరణ్ కి బావుంటుందని తను  బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇస్తారని వంశీకి రెఫర్ చేశారట. పైగా చరణ్ అంగీకరిస్తే తానే ఆ సినిమాను నిర్మిస్తానని కూడా చెప్పారట.

ఓ వైపు హీరోగా సంచలన విజయాలు దక్కించుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్న మహేష్.. నిర్మాణ రంగంలోనూ స్ట్రాంగ్ అవుతున్నారు. G.మహేష్ బాబు ప్రొడక్షన్ హౌజ్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆయన పలు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతోనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాలని చూస్తున్నారట మహేష్ బాబు. ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ కేటాయించేందుకు రెడీ అయ్యారట.

GMB ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ప్రారంభించిన మహేష్- నమ్రత జోడీ ఇప్పటికే పలు సినిమాల్లో భాగం పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌పై అడివి శేష్, శోభిత దూళిపాల హీరోహీరోయిన్లుగా 'మేజర్' సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ కూడా ఫినిష్ అయింది. లాక్‌డౌన్ పూర్తికాగానే మిగిలిన కొంతభాగం కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగానే విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమాను నిర్మించాలని మహేష్ బాబు ఫిక్స్ అయ్యారట.

ఈ మేరకు ఈ లాక్‌డౌన్ సమయంలో విజయ్‌తో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్ మహేష్ సతీమణి నమ్రత సెట్ చేసిందని ఫిలింనగర్ టాక్. సర్వ హంగులతో భారీ రేంజ్‌లో ఈ మూవీ ఉండనుందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు అఫీషియల్‌గా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా ఉంటుందని విన్నాం. సో.. చూడాలి మరి మహేష్ బాబు బ్యానర్ నుంచి ఎలాంటి బిగ్ న్యూస్ బయటకొస్తుందో!.

0/Post a Comment/Comments

Previous Post Next Post